👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
రైతులకు యూరియా పరంగా ఎటువంటి ఆందోళన కేంద్రాలకు, ప్రతి రైతుకు ఇబ్బందులు కలగకుండా యూరియా అందించే చర్యలు తీసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది అని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారులు, సొసైటీ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ సరిపడ యూరియాను అందిస్తాం.
👉🏻 జిల్లాకు సంబంధించిన రైతాంగం మొత్తం యూరియా విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం దృష్ట్యా ఈ రోజు జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘ సంస్థల అధికారులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించడం జరిగింది.
👉🏻 గత ఏడాది ఆగస్టు నెల వరకు 23వేల 3 వందల మెట్రిక్ టన్నుల యూరియాను ఆయా గ్రామాల్లో రైతులకు అందజేయడం జరిగింది
👉🏻 గత ఏడాది నుండి ఇప్పటి వరకూ సుమారు 21 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీల ద్వారా రైతాంగానికి అందజేయడం జరిగింది.ఇంకా 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా గోదాములో నిల్వ ఉండటం జరిగింది.
👉🏻 ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడటం జరిగింది, డిల్లీ పర్యటన సందర్భంగా అక్కడ కేంద్ర శాఖ మంత్రిని కలసి పరిస్థితి వివరించారు మంత్రి తెలిపారు.
👉🏻 చైనా నుండి ముడి సరుకు దిగుమతి కొంత ఆలస్యం కావడం వల్ల ఇట్టి సమస్య ఏర్పడటం జరుగుతుందని కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది అని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.