సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా
హైదరాబాదులో అమరవీరుల స్థూపం  ఆయన  విగ్రహం ప్రతిష్ఠాపనకు సోమవారం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  మరియు ఇతర మంత్రులు  సంయుక్తంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించిన జయంతి వేడుకలకు హాజరయ్యారు.

ఈ సందర్భంలో  ముఖ్యమంత్రి  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విశిష్ట జీవన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఆయన సామాజిక న్యాయం, ప్రజాహితం, ధైర్యసాహసాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారని అభిప్రాయపడ్డారు.

ఆయన ధైర్యోపేతమైన నాయకత్వం ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి ప్రదాతగా ఉంటుందని పేర్కొన్నారు. పాపన్న  చూపిన నిబద్ధత, ఆత్మసమర్పణ, సత్యనిష్ఠలను అనుసరించి ప్రజల సేవలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.