సెప్టెంబర్ 13న జాతీయ  లోక్ ఆదాలత్ !

👉 జగిత్యాల జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ,  ఆధ్వర్యంలో !

J.SURENDER KUMAR,

జాతీయ న్యాయ సేవా అధికారి సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికారి సంస్థ  ఆదేశాల మేరకు, జగిత్యాల జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ, ఆధ్వర్యంలో  సెప్టెంబర్13 న,  జాతీయ లోక్ అదాలత్ జరగనున్నది.

జగిత్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం  ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి మొదటి అదనపు జిల్లా జడ్జి S. నారాయణ ,  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు , మరియు ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులు, పాల్గొన్నారు.

సమావేశంలో జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహణ కోసం చర్యలు, కేసుల ఎంపిక ప్రక్రియ, మరియు లోక్ అదాలత్ నిబంధనలపై సమగ్రమైన చర్చ జరిగింది. కేసులపై త్వరిత విచారణ జరగడం ద్వారా, ఇరుపక్షాల మధ్య పూర్వస్థితి ఏర్పడేలా చూడాలని అవసరమైన సహకారం అందించేందుకు న్యాయవాదులు సమాయత్తం కావాలన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా వందలాది కేసులు పరిష్కారానికి  మార్గం సుగమనవుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ శ్రీమతి సీ. రత్న పద్మావతి  కోరారు.