శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుండి నేడు కాకతీయ కాల్వకు నీటి విడుదల!

J.SURENDER KUMAR,

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోనీ వానాకాలం పంటకు సాగునీరు అందించే ప్రణాళిక పై తెలంగాణ నీటిపారుదల శాఖ  ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశ (SCIWAM )నిర్ణయం మేరకు…

గురువారం ( ఈ నెల 7 న) న కాకతీయ, లక్ష్మీ కాల్వలకు సాగు నీరు  ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు. పోచంపాడ్ ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాసరావు గుప్త తెలిపారు.

శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్  ప్రస్తుతం ( గురువారం నాటికి ) 33.976 TMC నీటిని కలిగి ఉంది, దాని పూర్తి రిజర్వాయర్ స్థాయి (FRL) 1091.00 అడుగులు మొత్తం సామర్థ్యం 90.3 TMCలు .   

👉 పూర్తి జలాశయ స్థాయి (FRL): 1091.00 అడుగులు !

👉 ప్రస్తుత నీటి మట్టం: 1072.4 అడుగులు !

👉 మొత్తం సామర్థ్యం: 90.3 టిఎంసి !

👉 ప్రస్తుత నీరు అందుబాటులో ఉంది: 33.976 టీఎంసీలు !

👉 ఇన్‌ఫ్లోలు: ఈ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 30,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. !

👉 ప్రవాహాలు: మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి అవసరాలకు , ఇతర సాగునీటి అవసరాలకు మొత్తం 152 క్యూసెక్కుల ఔట్ ఫ్లో వద్ద నీటిని విడుదల చేస్తున్నారు. !