👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
జీవితాంతం సిద్ధాంతపరమైన విలువలతో కూడిన రాజకీయంతో పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డి ని శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా మంత్రివర్గంలో చర్చించి సముచితమైన నిర్ణయం తీసుకుంటాం, అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు.
👉 జీవితాంతం సిద్ధాంతపరమైన విలువలతో కూడిన రాజకీయంతో పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డి గారిని శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా మంత్రివర్గంలో చర్చించి సముచితమైన నిర్ణయం తీసుకుంటాం..” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌లో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ఆదివారం ముఖ్యమంత్రి నివాళులర్పించారు.
👉 సీపీఐ నాయకుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా నడుస్తున్న ప్రతి ఒక్కరికీ తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

👉 విలువలతో కూడిన సిద్ధాంత నిబద్ధత కలిగిన నాయకుల విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణంగా సానుభూతి ఉంది. అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ గౌరవార్థం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీకి పేరును పెట్టుకున్నాం. మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును పెట్టాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరును చిరస్థాయిగా గుర్తుంచుకునేలా అనేక విధాలుగా గౌరవించుకున్నాం కానీ సీఎం అన్నారు.
👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
👉 సీపీఐ నేతలు డి.రాజా, కె.నారాయణ, కూనంనేని సాంబశివరావు, అజీజ్ పాషా తో పాటు అనేకమంది నాయకులను ముఖ్యమంత్రి కలుస్తూ సురవరం సేవలను స్మరించుకున్నారు.

👉“విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు తన చివరి శ్వాస వరకు రాజీపడని నిరాడంబర జీవితం, రాజీపడని సిద్ధాంతంతో పనిచేశారని అన్నారు.
👉 ఏఐఎస్ఎఫ్ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినా, ఏనాడూ అహంకారం, అహంభావం తన దరిదాపుల్లోకి రానీయలేదు. పాలమూరు బిడ్డగా బూర్గుల రామకృష్ణ రావు, జైపాల్ రెడ్డి కోవలో కంచుపాడు కామ్రేడ్ సురవరం పాలమూరు జిల్లాకు ఎంతో వన్నె తెచ్చారు.
👉 హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో, పత్రికా సంపాదకుడిగా ఎనలేని సేవలు అందించిన సురవరం ప్రతాప రెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టాలని సుధాకర్ రెడ్డి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తో లేఖ పంపించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి సూచన మేరకు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టాం.
👉 ఇదే సందర్భంగా సుధాకర్ రెడ్డి ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుతానని ఆరోజు చెప్పాను. అయితే కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుసుకోవలసిన పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అధికారంలో ఉన్నా లేకున్నా, ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకున్నా వారెప్పుడూ సిద్ధాంతాన్ని వదల్లేదు.
👉 కాంగ్రెస్ సమావేశంలోనూ వారి సేవలను స్మరించుకుని ఘనంగా నివాళులర్పించాం. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సంతాప సందేశాన్ని పంపించారు. ప్రభుత్వ పక్షాన సురవరం కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.