👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం తక్షణ సహాయంగా కేంద్రం యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేయాలి అని, ఈ నిధుల విడుదల వల్ల ఎస్సీ వర్గాలలో న్యాయం, సాధికారత, అభివృద్ధి మరింత బలోపేతం అవుతుందని,
కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేను, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.
👉 ఢిల్లీలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కార్యాలయంలో గురువారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తో కలిసారు.
👉 ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్రమంత్రికి, మంత్రి లక్ష్మణ్ కుమార్ వినతి పత్రం ఇచ్చారు.
👉 పీసీఆర్ / పీవోఏ చట్టాల అమలుకు ₹ 232.68 కోట్లు ( పాత బకాయిలతో కలిపి) మరియు పీఎం-AJAY పథకం కింద 2025-26 సంవత్సరానికి ₹ 82.20 కోట్లను కేంద్రం నుండి విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం తన వాటాను చెల్లించిందని, కేంద్ర వాటా నిధులు నేటికీ విడుదల కాలేదని వినతి పత్రంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
👉 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు నిధులు ఇవ్వండి !
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల కోసం కేంద్ర ఆర్థిక సాయం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
👉 తెలంగాణలో విద్యార్థులకు నాణ్యత ప్రమాణాల గల విద్యను మరింత మెరుగుపరచడానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని యంగ్ ఇండియా పథకం ప్రారంభించినట్లు మంత్రి వివరించారు.
👉 రాష్ట్రంలో 1,023 రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో సుమారు 650 అద్దె భవనాల్లో పని చేస్తున్నాయని, ఇది విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
👉 నేటి వరకు 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ( YIIRS ప్రాజెక్టులకు ) ₹ 200 కోట్ల వ్యయంతో పనులు మంజూరయ్యాయని, కేంద్ర కేంద్రమంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
👉 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తాయని మంత్రి తెలిపారు. ఈ యోజనను విజయవంతం చేయడానికి కేంద్రం నుండి ఆర్థిక సహాయం చాలా అవసరమని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.