J.SURENDER KUMAR,
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్
మామిడాల శంకరయ్య, సోమవారం గుండెపోటుతో మృతి చెందారు.
వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లిన శంకరయ్య, ఓ గ్రామంలో కొందరితో మాట్లాడుతుండగా, ఒకేసారి కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రాథమిక వైద్య సేవలు అందించి హుటాహుటిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు శంకరయ్య ప్రాణాలు రక్షించడానికి విశ్వప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. ఆదిలాబాద్ నుండి శంకరయ్య మృతదేహం తిమ్మాపూర్ కు తరలిస్తున్నారు. మంగళవారం దహన సంస్కారాలు జరుగుతాయని ఆయన మిత్రులు తెలిపారు.
మాజీ సర్పంచ్ మృతి పట్ల తిమ్మాపూర్ సింగిల్ విండో చైర్మన్ సాయిని సత్యనారాయణ, లిఫ్ట్ ఇరిగేషన్ సంఘ అధ్యక్షుడు, వావిలాల ప్రకాష్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు కస్తూరి నాగభూషణం, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.