ఉర్దూ భాష తెలంగాణ సంస్కృతిలో భాగం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ఉర్దూ భాష తెలంగాణ సంస్కృతిలో ఒక అవిభాజ్య భాగమని, భాషా సౌభ్రాతృత్వానికి ఇది వంతెనగా నిలుస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

హైదరాబాదులోని తెలంగాణ విద్యా పరిషత్ భవన్‌లో ఆదివారం “బెస్ట్ ఉర్దూ టీచర్స్ అవార్డ్స్” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ముఖ్య అతిథిగా హాజరై, రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 173 మంది ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు.


👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

భవిష్యత్తు తరాలకు ఉర్దూ భాషా వారసత్వాన్ని అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని ఆయన అభినందించారు. భాష, సాహిత్యం, విద్య అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహిర్ బిన్ ఆమ్దన్, వక్ఫ్ చైర్మన్ హాజమతుల్లా, మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సజ్జాద్ అలీ, సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎ. మాజిద్, TMREIS అధ్యక్షుడు ఫహీం ఖురేషీ, మైనారిటీ కార్యదర్శి షఫీఉల్లా తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు.

అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు మంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఉర్దూ భాష అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని అన్నారు. సంకల్పించారు.