J.SURENDER KUMAR,
మా ప్రజా పాలన ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తూ మౌలిక సదుపాయాల కల్పన కోసం వేలాది కోట్ల నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ₹ 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కలెక్టర్ నిధుల ద్వారా నిర్మించనున్న KGBV లో డార్మేటరి గదుల నిర్మాణానికి మరియు
₹12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో MGNREGS నిధుల ద్వారా నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి అధికారులు మండల నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు..

అనంతరం కస్తూర్బా పాఠశాలను అధికారులతో కలిసి సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజనం, విద్యార్థులకు వసతి గదులను మంత్రి పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.

డార్మేటరి గదుల నిర్మాణాన్ని వీలైంత త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకోవచ్చే విధానంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
👉 సన్న బియ్యం సరఫరా చేయండి !

ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలకు తక్షణం సన్న బియ్యం సరఫరా చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.
మంత్రి పర్యటనలో అకస్మాత్తుగా మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు అన్నం మెత్తగా అవుతుందని మంత్రికి వివరించారు. మంత్రి స్పందించి జిల్లా అధికారులతో సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే బోజన నాణ్యత విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం వహించరాదని, సిబ్బంది దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.