విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

జిల్లాలోని సంక్షేమ, గురుకుల పాఠశాలలు మరియు వసతి గృహాలను అధికారులు నిరంతరం సందర్శించాలని, విద్యార్థులకు మెను ప్రకారం భోజనం, మరియు బోజన నాణ్యత ప్రమాణాల  విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

వరంగల్ జిల్లా కేంద్రంలోని స్థానిక హరిత హోటల్ లో శనివారం జిల్లా కలెక్టర్ మరియు ఎస్సీ సంక్షేమ  అధికారులతో జిల్లా ఇంచార్జి  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పాఠశాలలు మరియు వసతి గృహాలు వంటి తదితర అంశాలపై కలెక్టర్, మరియు అధికారులను వివరాలను మంత్రి తెలుసుకున్నారు.

వర్ష కాల నేపథ్యంలో విద్యార్థులు అనారోగ్యం, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందుకు వైద్య అధికారులు విద్యార్థులుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచనలు చేశారు.