👉 ఢిల్లీలో కేంద్ర మంత్రి వీరేందర్ కుమార్ కు విజ్ఞప్తి చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
వికలాంగుల పెన్షన్ ₹ 300 రూపాయలు నుండి ₹ 3000 వేలకి పెంచి, వికలాంగుల పెన్షన్ అర్హత 80% నుండి 40% కి తగ్గించాలి అని కేంద్రమంత్రి డాక్టర్ వీరేందర్ కుమార్ ను కలసి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తో కలసి విజ్ఞప్తి చేశారు.
డిల్లీలో కేంద్ర మంత్రి డాక్టర్ వీరేందర్ కుమార్ ను గురువారం శాస్త్రి భవన్ లో మంత్రి చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి వికలాంగుల సంక్షేమం కోసం పలు అంశాలను విన్నవించి వినతి పత్రం ఇచ్చారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
18 సంవత్సరాల నుండి 79 సంవత్సరాల వరకు ఉన్నా వికలాంగుల కి ₹ 300 రూపాయలు పెన్షన్, 80 సంవత్సరాలు ఆపైనా ఉన్న వికలాంగులకు ₹ 500 రూపాయలు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ నేషనల్ డిజాబిలిటీ పెన్షన్స్ స్కీం (IGNDPS) క్రింద ఇస్తున్నారు అని మంత్రి వివరించారు.
👉 2014 నుండి బీజేపీ కేంద్రం లో అధికారం లోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా పెంచలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ₹ 300 రుపాయలు వికలాంగుల ప్రాథమిక అవసరాలకి ఏమాత్రం సరిపోదని పది సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువులు ధరలు 5 వందల రేట్లు పెరిగాయి అని వివరించినట్టు తెలిపారు.
👉 కేంద్రం ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కూడా దాదాపు ₹ 20 లక్షల కోట్లు దాటింది అని,వికలాంగులహక్కుల చట్టం-2016 ప్రకారం వికలాంగుల కి 5%బడ్జెట్ అనగా ₹ 1 లక్ష కోట్ల రూపాయిలు కేటాయించి ఈ మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న వికలాంగుల పెన్షన్ కనీసం ₹ 3000 రూపాయలు కి పెంచాలి అని విజ్ఞప్తి చేసినట్టు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

👉 ప్రస్తుతం 80% వైఖల్యం ఉంటేనే పెన్షన్ ఇస్తున్నారు అని,18 ఏండ్లు నిండితేనే పెన్షన్ ఇస్తున్నారు. ఇది సరియైన విధానం కాదు అని ఇది పార్లమెంట్ యాక్ట్ వికలాంగుల హక్కుల చట్టం -2016 కి విరుద్ధం అని ఈ చట్టం ప్రకారం 40 % బెంచ్ మార్క్ వైఖల్యం కి అన్నీ సంక్షేమ పథకాలు కి అర్హులు అని తెలంగాణ రాష్ట్రం లో మేము 40%కే పెన్షన్ ఇస్తున్నాము అని, కేంద్రమంత్రికి వివరించినట్టు తెలిపారు.
👉 వికలాంగులుగా పుట్టగానే వైఖల్య ధ్రువీకరణ పత్రం ఇచ్చి, ₹ 4016 పెన్షన్ ఇస్తున్నాము అని త్వరలో నే ఈ పెన్షన్ ₹ 6 వేల కి పెంచుతాం, కేంద్ర ప్రభుత్వం సైతం తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకోని మార్పులు చేయాలి అని కోరినట్టు మంత్రి తెలిపారు.
👉 తెలంగాణ లో వికలాంగుల కార్పొరేషన్ ద్వారా అందించే ఉచిత సహాయ ఉపకరణాలు దేశం లో ఎక్కడ లేని విదంగా 40% వైఖల్యం కే ఇస్తున్నాము అని కేంద్రం కూడా 40% వైఖల్యంకే వికలాంగుల పరికరాలు ఇవ్వాలి అని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.