వైభవంగా పరేడ్ గ్రౌండ్ లో పంద్రాగస్టు వేడుకలు !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ పంద్రాగస్టు వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అమలవుతున్న కార్యక్రమాలను ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు పరేడ్ గ్రౌండ్ లో స్టాల్స్ లలో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా, ఎస్పీ అశోక్ కుమార్ ఆయా శాఖల అధికారులు ప్రదర్శన  స్టాల్స్ ను సందర్శించారు.