J SURENDER KUMAR,
రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ విండో ల ( పిఎసిసిఎస్, డిసిసిబి ) ఆ పదవి కాలం 6 నెలల పొడిగిస్తూ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, గురువారం, జీవో ఆర్ టీ సంఖ్య
386 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు, మరియు జిల్లాల ప్రకారం పి ఎస్ సి సి ఎస్, డి సి సి బి ల పునర్వ్యవస్థీకరణ అంశం పెండింగ్‌లో ఉన్నందున వాటికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పదవీకాలం పూర్తయిన తేదీ నుండి ఆరు (6) నెలల పాటు లేదా, ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, పొడగింపు వర్తిస్తుంది.
👉 ఇతరులను పర్సన్ ఇన్చార్జిగా నియమించవచ్చు!
పదవీ విరమణ చేసిన మేనేజింగ్ కమిటీలు, సొసైటీ వ్యవహారాలను నిర్వహించడానికి తగినవి కావు మరియు సరిపోవు అని భావించబడినప్పుడు మరియు పేలవంగా పనిచేస్తున్నప్పుడు, లేదా TCS చట్టం, 1964 మరియు సంబంధిత నియమాల ప్రకారం ఏ స్థాయిలోనైనా అనర్హతకు గురయ్యే సందర్భంలో, సహకార సంఘాల రిజిస్ట్రార్ చట్టంలోని సెక్షన్ 32(7) (a) ప్రకారం సొసైటీల వ్యవహారాలను నిర్వహించడానికి ఇతర వ్యక్తిని, లేదా వ్యక్తులను నియమించవచ్చని ప్రభుత్వం ఆదేశిస్తుంది అని జీవోలో పేర్కొనబడింది.
2020 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం పదవీకాలం 2025 ఫిబ్రవరి నాటికి ముగిసింది. ఫిబ్రవరి 14, నుంచి ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు వీరి పదవి కాలం పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం మరోసారి పదవి కాలం పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.