👉 ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు !
J.SURENDER KUMAR,
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన స్టేజ్ -1 లోని ఒకటవ యూనిట్ జాతికి శుక్రవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లతో కలిసి జాతికి అంకితం చేశారు,
👉 ₹ 970 కోట్ల రూపాయల వ్యయంతో వైటీపీఎస్ లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి, హాజరైన రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్,రాష్ట్ర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ….
డిసెంబర్ చివరి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని అన్ని యూనిట్లను పూర్తిచేసి 2026 జనవరి నుండి పూర్తిస్థాయిలో విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్కమల్లు తెలిపారు. ఇందుకుగాను నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పని చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
👉 ఇదివరకే రూపొందించిన క్యాలెండర్ ను తూ.చా తప్పకుండా పాటించాలన్నారు. నిర్దేశించిన సమయంలోగా అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ అందించేందుకు వైటిపీఎస్ అధికారులు పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకోవాలన్నారు.
👉 డిసెంబర్ లోగా అన్ని యూనిట్లను పూర్తి చేసి జనవరి 2026 నుండి పూర్తి స్థాయిలో విద్యుత్ అందించేలా సమయాన్ని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పని చేయాలన్నారు.

👉 ఇందుకు సంబంధించిన పూర్తి ప్రోటోకాల్ ను పాటించాలని, అంతేకాక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయనే విధంగా అభివృద్ధి చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల,ఆస్పత్రులు నిర్మించి పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు జరిగేలా చూడాలని చెప్పారు.
👉 పవర్ ప్లాంట్ ఆవరణలోని డిఏవి పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల ను పవర్ ప్లాంట్ లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు,
👉 అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పనికొచ్చే విధంగా ఆసుపత్రి నిర్మాణం, అంబులెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. బొగ్గు లారీలు,బూడిద లారీలతో రోడ్లు దెబ్బతిన్న కారణంగా సిసి రోడ్లను మంజూరు చేయడం జరిగిందని,యుద్ధ ప్రాతిపదికన సిసి రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, ఇందుకు సంబంధించి నష్టపరిహారం ,భూసేకరణకు సంబంధించిన పనులు సైతం వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.
👉 రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ..
పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ మంజూరు కావడం జరిగిందని,అయితే ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని,త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పారు.
👉 మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..
93 కిలోమీటర్ల డబుల్ లైన్ రైల్వే పనులకు సరైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి రానందున ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. రహదారుల పూర్తికి 280 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాక క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ ,నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి ,జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ వి. కుమార్ రాజు తోపాటు, వైటీపీఎస్ పర్యవేక్షక ఇంజనీర్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు