👉 శ్రీ విఖనస మహర్షి జయంతి సభలో….
J SURENDER KUMAR,
సర్వ ఆగమాలకు మూలం వైఖనసాగమేనని శ్రీ విఖనస మహర్షి జయంతి సభలో పండితులు ఉద్ఘాటించారు. తిరుమలలో శనివారం శ్రీ విఖనస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆస్థాన మండపంలో టీటీడీ అళ్వార్ దివ్య ప్రభంద ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్దాంత వివర్ధని సభ సంయుక్త ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ దీవి రాఘవ దీక్షితులు ప్రసంగిస్తూ విఖనస మహర్షి రచించిన శ్రీ వైఖానస కల్పసూత్రమ్ లో 18 సంస్కారాలు, 22 యజ్ఞాలు, ధర్మాలు, ప్రాయశ్చిత్తాలు ఉపదేశించబడ్డాయని తెలిపారు.

శ్రీ వైఖనస కల్పసూత్రమ్ ద్వారా ఆవిర్భవించిందే వైఖానస ఆగమమని, తిరుమల శ్రీనివాసునికి వైఖనస ఆగమం ప్రకారమే అర్చనాదులు జరపబడుతున్నాయని వక్తలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దీవి శ్రీనివాస దీక్షితులు, ప్రొఫెసర్ వేదాన్తం విష్ణుభట్టాచార్యులు, గంజాం ప్రభాకరాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.