అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మండలం రాయపట్నం, దోనూర్ గ్రామాలలో ₹ 44 లక్షల అభివృద్ధి పనులకు గురువారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పూజలు చేశారు.


రాయపట్నం గ్రామంలో ₹ 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు,  ₹ 5 లక్షల వ్యయంతో చేపట్టిన అంబేద్కర్ సంఘ భవన మిగులు పనులకు, మంత్రి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ చేశారు. ₹ 1.5 లక్షల వ్యయంతో వీధి దీపాలు  ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

👉 గ్రామ పంచాయతీ భవన ప్రారంభం !

మండలంలోని దొనూర్ గ్రామంలో ₹16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన  గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రారంభించారు.  గ్రామంలో ₹10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి ఇంటికీ అభివృద్ధి ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటామని మంత్రి గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.