J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి మండలం నాగారం, గొల్లపల్లి మండలం కేంద్రంతోపాటు దమ్మన్నపేట, ఆత్మకూర్ గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగారం గ్రామంలో సుమారు ₹ 54 లక్షల వ్యయంతో నిర్మించిన డ్రైనేజ్, మరియు CC రోడ్లను మంత్రి అధికారులతో, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు.

మండల కేంద్రమైన గొల్లపెల్లి లో సుమారు ₹ 20 లక్షల వ్యయంతో నిర్మించిన డ్రైనేజ్ మరియు CC రోడ్లను మరియు శ్మశాన వాటికకు,ఎస్సీ కుల సంఘ భవనానికి మంత్రి అధికారులతో, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
గొల్లపెల్లి మండలం లో దమ్మన్నపేట గ్రామంలో సుమారు ₹ 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన అంగన్వాడీ భవనానికి అదే విధంగా ఆత్మకూరు గ్రామంలో ₹ 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ సంఘ భవనానికి మరియు ₹ 5 లక్షల రూపాయల వ్యయంతో బీరయ్య దేవాలయం వద్ద రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
👉ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పలు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు ₹ 2 లక్షల రూపాయల రుణమాఫీ, అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి” అని మంత్రి అన్నారు.

అనేక గ్రామాలకు సంబంధించిన కొన్ని సమస్యలు, కులసంఘాల భవనాల నిర్మాణం వంటి అంశాలు తన దృష్టికి వచ్చినందున వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.