ఏసీబీ అధికారుల పేరిట ఫోన్ చేస్తే ఫిర్యాదు చేయండి !

👉 ఏసిబి డైరెక్టర్ జనరల్ !

J.SURENDER KUMAR,

కొంతమంది వ్యక్తులు ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ చేసి బెదిరిస్తే ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయండి అని ఎసిబి డైరెక్టర్ జనరల్ తెలిపారు. మొబైల్ నంబర్ 9154893428 నుండి  కాల్స్ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయవద్దని డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది అని మంగళవారం జారీ చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

ఇలాంటి సంఘటనలో, మంగళవారం హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు నమోదైంది ప్రకటనలో పేర్కొన్నారు.
ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగి, లేదా సామాన్య ప్రజలకు ఏవైనా  కాల్స్ వస్తే, వారు వెంటనే ACB టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

స్థానిక పోలీస్ స్టేషన్లకు కూడా ఫిర్యాదు ఇవ్వవచ్చు. లేదా ఏసీబీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా సంప్రదించవచ్చు,


👉 Whatsapp (9440446106),

👉  Facebook (Telangana ACB), X/ గతంలో Twitter (@TelanganaACB). బాధితుడు/ఫిర్యాదుదారుడి పేరు మరియు వివరాలు రహస్యంగా ఉంచుతామని వివరించారు.