ఏపీ గవర్నర్ కు తిరుమలలో ఘన స్వాగతం !

J SURENDER KUMAR,

 శ్రీవారి దర్శనార్థం తిరుమలకు సోమవారం రాత్రి విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  అబ్దుల్ నజీర్ కు తిరుమలలోని విధాత నిలయం (రచన) విశ్రాంతి గృహాం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పుష్ప గుచ్ఛం అందించి ఘనంగా స్వాగతించారు

ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసులు గౌరవ వందనం అందించారు. మంగళవారం ఉదయం  గవర్నర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ (దేవాదాయ శాఖ) డా. హరి జవహర్ లాల్, టీటీడీ సీవీఎస్వో  మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.