J SURENDER KUMAR,
అర్హులైన లబ్ధిదారులు అందరికీ ఇందిరమ్మ ఇళ్ళను ఇప్పించే బాధ్యత నాది అని ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
బుధవారం ఎండపెల్లి మండలం ముంజంపల్లి, మారేడుపల్లి గ్రామాల కు చెందిన అర్హులైన లబ్ధిదారులు 29 మందికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ…
రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, మంత్రి అన్నారు.

మొదటి విడతలో ఇల్లు రాని వారు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని ఎంత మంది అర్హులైన పేద లబ్ధిదారులు ఉంటే అంత మందికి ఇళ్లను మంజూరు చేస్తామని, ప్రభుత్వం నుండి అందించే ₹5 లక్షల రూపాయలను దశల వారిగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని మంత్రి తెలిపారు.
.