బండ శంకర్ ను అభినందించిన మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి !

👉 అత్యున్నత పురస్కారంతో జగిత్యాల జిల్లాకు గర్వకారణం !


J SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో సోమవారం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ జననీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అవార్డు గ్రహీత బండ శంకర్‌ ని మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డిఅభినందించారు.

ఇటీవల పంజాబ్ లోని చండీగఢ్ లో గల రాడిషన్ హోటల్లో పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ కటారియా చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన బుద్ధ పీస్ అవార్డు అందుకోవడం జగిత్యాల జిల్లాకే గర్వకారణం అన్నారు , ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరిన్ని అవార్డులు సాధించుకుంటూ జగిత్యాల జిల్లాకు జాతీయస్థాయిలో వన్నె తేవాలని కోరారు.


  ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తమోహన్, జగిత్యాల బ్లాక్ అధ్యక్షులు గాజంగి నందయ్య, నిజామాబాద్ పార్లమెంటరీ పార్టీ లీగల్ సెల్  ఇన్చార్జ్ గుంటి జగదీశ్వర్, మాజీ కౌన్సిలర్లు కల్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, మాజి సర్పంచులు చందా రాధా కిషన్ రావు, జున్ను రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెపు మొగిలి యువజన, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు