బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఉత్సవం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

బతుకమ్మ పండగ వేడుకలు తెలంగాణ సాంప్రదాయాల ప్రతిబింబం మాత్రమే కాదు, మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే గొప్ప ఉత్సవమని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగిన  బతుకమ్మ పండగ ఉత్సవాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్, ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిని వెలిగించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

తెలంగాణ ఆచార, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల వేడుక బతుకమ్మ , ఆడపడుచులు సంతోషంతో, ఉత్సాహంగా  ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే ఏకైక పువ్వుల పండుగ మంత్రి అన్నారు.

వివిధ రకాల పువ్వులను, ఆకులను, అమ్మవారి రూపంగా అందంగా పేర్చి, అలంకరించి ప్రకృతిని పూజించే అపూర్వ సాంప్రదాయం ప్రపంచ దేశాలు ఎక్కడా లేదని, మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వ  పాలనలో  మహిళల ఆర్థిక సౌలభ్యం కోసం ప్రత్యేక స్థానం కల్పించామని, మంత్రి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ద్వారా మహిళలకు రవాణా సౌకర్యం కల్పించామని, మహిళా సంఘాల ద్వారా రుణాలు అందిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని కల్పిస్తున్నామని, మంత్రి అన్నారు.

అతి త్వరలోనే ఇందిరమ్మ చీరలు పంపిణీ, ₹500 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు,  మహిళల పేరిట  ఇందిరమ్మ ఇళ్ళు, తదితర సంక్షేమ కార్యక్రమాలు  రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.