చెరుకు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 రైతులు అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను!

J . SURRENDER KUMAR,

చెరుకు రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చె విధానంగా ఈ రోజు ముత్యం పేట చెక్కెర కర్మాగారాన్ని సందర్శించడం జరిగిందని, ఇక్కడ రైతులు వినిపించిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లను మరియు చెరుకు రైతులతో ముఖాముఖి చర్చ కార్యక్రమం లో పాల్గొనడానికి శుక్రవారం  మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కుమార్ , ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పరిశ్రమలు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంజయ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖ రఘునందన్ రావు, డైరెక్టర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీస్ సిహెచ్ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన చెరుకు రైతుల ముఖాముఖి చర్చా కార్యక్రమం నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి  లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

చెరుకు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చె విధానంగా ఈ రోజు ముత్యం పేట చెక్కెర కర్మాగారాన్ని సందర్శించడం జరిగిందని, ముత్యపేట చెరుకు రైతులు తమ కర్మాగారాన్ని తెరిపించాలని పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ  పాదయాత్రలో పాల్గొని వారికి విన్నవించడం జరిగిందన్నారు.

👉 ప్రతి పక్షంలో ఉన్నపుడు ఈ చెక్కర కర్మాగారాన్నీ తిరిగి తెరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, దానికి అనుగుణంగా ఈ ఫ్యాక్టరీకి చెందిన సుమారు ₹ 172 కోట్లకు పైగా బకాయిలను ప్రభుత్వం చెల్లించడం జరిగిందని మంత్రి అన్నారు.

👉 నేరుగా రైతుల నుండే చెరుకును సేకరించి దాని నుండి చెక్కెర ఉత్పత్తి చేయాలన్నది ముఖ్యమంత్రి  ఆలోచన అని, చెరుకు రైతుల సీడ్ గురించి, మద్దతుదర గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి అన్నారు.

👉 ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన ఏర్పాట్లను
రాష్ట్ర ప్రభుత్వం చెరుకు రైతులకు ఇచ్చిన హామీ మేరకు చెరుకు ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి
కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగిందని మంత్రి అన్నారు.

👉 జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కోరుట్ల, కథలాపూర్, జగిత్యాల మండలాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని మండలాలు, నిర్మల్ జిల్లా లోని కొన్ని మండలాల రైతులకు చెరుకు ఫ్యాక్టరీ పునః ప్రారంభించడం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

👉 ఇదివరకు చెరుకు రైతులు కామారెడ్డి లోని షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలించేవారు తద్వారా రైతులపై రవాణా ఖర్చులు అధిక భారం అవుతున్న నేపథ్యంలో వరంగల్ డిక్లరేషన్ సభలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఫ్యాక్టరీ చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

👉 రైతులకు విత్తనాలు, సబ్సిడీ, మద్దతు ధర కల్పిస్తామని భరోసా కల్పించారు. 100% రైతులకు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని తెలిపారు. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలంటే రైతులు కనీసం 10 నుండి 15 ఎకరాలు చెరుకు సాగు చేయాలని కోరారు.

👉 శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పై ఆధారపడి రైతులు వరి, మొక్కజొన్న పంటలు అధికంగా పండిస్తున్నారని వాటితో పాటు పరిస్థితులు కనుగుణంగా పంట మార్పిడి చేయాలని తద్వారా అధిక దిగుబడులు అందుతాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.


👉 స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ  సంజయ్ కుమార్ మాట్లాడుతూ…

ప్రభుత్వం నిర్వహించే బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ శాఖకు సీడ్స్, సబ్సిడీలు అందిస్తూ ప్రభుత్వం కేటాయిస్తుందని  తెలిపారు.
చెరుకు పంటలను డ్రిప్ పద్ధతుల ద్వారా పండిస్తే అధిక లాభాలు ఉంటాయని పేర్కొన్నారు.
డ్రిప్ పద్ధతులను ఉపయోగిస్తే నీటి వినియోగం తగ్గి నీటి వనరులను కాపాడినట్లేనని పేర్కొన్నారు.

👉 ఫ్యాక్టరీ వినియోగంలోకి రావాలంటే రైతులు 10 నుండి 15 వేల ఎకరాల చెరుకు సాగు చేయాలని కోరారు. స్థానిక రైతుల ఆసక్తి చూస్తే ఖచ్చితంగా మా అంచనాలకు మించి సాగు చేస్తారని ఆశ భావం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను పాటించాలని కోరారు. సంబంధిత అధికారులతో చర్చించి సూచనలు సలహాలు తీసుకోవాలని కోరారు.


👉 వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు మాట్లాడుతూ..

ప్రత్యక్షంగా చెరుకు ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం రైతులు మరియు కమిటీ సభ్యులతో చర్చించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.


గమనించిన విషయం ఏమిటంటే ఇక్కడి రైతులు చెరుకు పండించడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తించామని తెలిపారు.
ఆదేశాలు మేరకు పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.నిజం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ వినియోగంలోకి తీసుకురావాలంటే రైతుల ప్రోత్సాహం అత్యవసరం. 10 నుండి 15 వేల ఎకరాల్లో చెరుకు సాగు చేసి ఫ్యాక్టరీ నిర్వహణకు తోడ్పడాలని కోరారు.

👉 రైతులు మాట్లాడుతూ….

దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రైతుల ఆకాంక్షను నిర్వహించనున్న రాజకీయ నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు.

👉 నిజం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన నుండి నేటి వరకు ఈ ప్రాంతంలో చెరుకు పంట పండిస్తున్నామని రైతులు తెలిపారు.

👉 ఫ్యాక్టరీ మూతపడిన కూడా కొంతమంది రైతులు చెరుకు పండించే కామారెడ్డి లోని షుగర్ ఫ్యాక్టరీ కి తరలిస్తూ ఉన్నారని తెలిపారు.
తద్వారా రైతులకు రవాణా ఖర్చులతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాపోయారు.

👉 ప్రభుత్వం చొరవ చూపి ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులకు ఏర్పాటు చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ భూమి చెరుకు పంటకు అనుకూలంగా ఉందని అధిక దిగుబడు అధిక దిగుబడులను  సాధించి ఫ్యాక్టరీ నిర్వహణకు తోడ్పడతామని తెలిపారు. ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీరు అందుతుందని వరద కాలువ వల్ల భూగర్భ జలాలు ఈ ప్రాంతంలో మెండుగా ఉన్నాయని తెలిపారు.

👉 ఈ ప్రాంతములో కోతుల బెడద ఎక్కువ ఉన్నందున అధికారులు తగు చర్యలు చేపట్టాలని రైతుల కోరారు. గత పది సంవత్సరాలుగా మూతపడిన ముత్యం పేట షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడం వల్ల రైతులకు లాభదాయకంగా మారుతుందని తెలిపారు.ప్రభుత్వం సబ్సిడీలో విత్తనాలు మరియు రవాణా ఖర్చులు భరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, సంబంధిత జిల్లా అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.