J.SURENDER KUMAR,
కాళేశ్వరం నుండి పలుగుల 7 కిలోమీటర్ల డబల్ రోడ్డుకు ₹ 22 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిదుద్దిళ్ళ శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.
👉 మంథని నియోజకవర్గంలోని భూపాల్ పల్లి జిల్లాలోని మాహదేవ్ పూర్ మండలము- కాళేశ్వరం నుండి పలుగుల గ్రామానికి 7 కిలోమీటర్లు డబల్ రోడ్డు నిర్మాణ పనులకు ₹ 22 కోట్ల నిధులు ప్రభుత్వం నుండి రోడ్డు భవనాల శాఖ శుక్రవారం మంజూరు చేసింది.
👉 కాళేశ్వరం నుండి పలుగుల డబల్ రోడ్డు నిధులు మంజూరుకు కృషిచేసిన రాష్ట్ర రోడ్డు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

👉 కాళేశ్వరం నుండి పలుగుల డబల్ రోడ్డు నిధులు మంజూరు సంబంధించిన పలుగుల, కుంట్లం, కాలేశ్వరం, మద్దులపల్లి గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.