J SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో గురువారం రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు లెఫ్ట్‌నెంట్ జనరల్ హర్పాల్ సింగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.
ఇండియన్ ఆర్మీలో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన హర్పాల్ సింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మార్గనిర్దేశం చేయడంలో, రక్షణ దళాల కోసం వ్యూహాత్మక సొరంగాలు, ఇతర సదుపాయాల కల్పనలో ఆయనకు విశేషమైన అనుభవం ఉంది.