J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా కాన్సులేట్‌కు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో సాగిన ఈ భేటీలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి.