సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బి.ఎన్.ఐ ప్రతినిధి బృందం !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (BNI – Business Network International) హైదరాబాద్ ప్రతినిధి బృందం శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసింది.

బీఎన్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 వ తేదీల్లో హైదరాబాద్ శంషాబాద్‌లో నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో (BNI Vantage GoNat 2025) వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి వివరించారు.

బీఎన్ఐ హైదరాబాద్ చాప్టర్ కు చెందిన అనిరుధ్ కొణిజేటితో పాటు పలువురు ప్రతినిధులు ముఖ్యమంత్రి ని కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో (MSME Expo)తో పాటు బీఎన్ఐ హైదరాబాద్ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై సదస్సులను నిర్వహిస్తుంది.

బీఎన్ఐ హైదరాబాద్ చాప్టర్ దాదాపు 400 లకు పైగా పరిశ్రమలు, 4 వేలకు పైగా వ్యాపార యాజమాన్యాల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. వ్యాపార సంబంధాలు, పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమల మధ్య సహకారం వంటి అంశాలను ఈ ఎక్స్‌పోలో చర్చించనున్నారు.