J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికా న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై వారు చర్చలు జరిపారు.
👉 విద్య, గ్రీన్ ఎనర్జీ, వినోద పరిశ్రమ (ప్రత్యేకంగా సినిమా రంగం), మౌలిక సదుపాయాల అభివృద్ధి (మెట్రో, పట్టణ రవాణా) మరియు మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలు చర్చలో ప్రస్తావనకు వచ్చాయి.

👉 ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి వివరించారు. ఐటీ, ఫార్మా రంగాలు సహా రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక ప్రాధాన్యతలను పేర్కొన్నారు.

👉 ఈ సమావేశంలో న్యూజెర్సీ ప్రథమ మహిళ శ్రీమతి టామీ మర్ఫీతో పాటు న్యూజెర్సీ రాష్ట్ర ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.