సీఎం రేవంత్ రెడ్డి తో వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సమావేశం !

J SURENDER KUMAR,

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) అధ్యక్షుడు, సీఈఓ బోర్గె బ్రెండీతో సమావేశమయ్యారు. న్యూ ఢిల్లీలో జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) వార్షిక సదస్సులో ప్రసంగించిన అనంతరం  ముఖ్యమంత్రి  పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు

👉 ఈ సందర్భంగా బ్రెండీ , వచ్చే ఏడాది జనవరిలో దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ని ఆహ్వానించారు. అదేవిధంగా, త్వరలో హైదరాబాద్ పర్యటనకు వస్తానని, రాష్ట్రంతో సహకారం కోసం మరిన్ని అవకాశాలను పరిశీలిస్తానని తెలిపారు.

👉 “గత ఏడాది కాలంలో తెలంగాణ అసాధారణ పురోగతి సాధించింది. భారతదేశంలో అత్యంత విజయవంతమైన రాష్ట్రాలలో ఒకటిగా ఎదుగుతోంది. దీని వెనుక రహస్యమేంటి?” అని బ్రెండీ  ప్రశ్నించగా, “కష్టపడి పని చేయడం, అందరి మద్దతే విజయానికి మూలం” అని ముఖ్యమంత్రి  సమాధానమిచ్చారు.

👉 రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న Telangana Rising 2047 లక్ష్యాలను అభినందిస్తూ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం తరఫున సంపూర్ణ మద్దతు అందిస్తామని బ్రెండీ  హామీ ఇచ్చారు.