J.SURENDER KUMAR,
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రామ శైలజ అయ్యర్ కు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు సాంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

2027 జూలై మాసంలో జరగనున్న గోదావరి నది పుష్కరాల సమీక్ష సమావేశం మంత్రి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన బుధవారం ధర్మపురి ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి
విచ్చేసిన దేవాదాయ ప్రిన్సిపల్ కార్యదర్శి, కలెక్టర్ సత్యప్రసాద్ కు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.

శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ ఉగ్ర నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాలను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అనంతరం
ఆలయాలు, ఆలయ ప్రాంగణాలను, పరిసరాలను పరిశీలించారు. క్షేత్రంలోని పుష్కరిణి, వీధులు , ఇసుక స్తంభం, పరిసరాలను వారు పరిశీలించారు. ఆలయ అర్చకులు వేద పండితులు పాలకవర్గ సభ్యులు దేవాదాయ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజ కు స్వామి వారి ప్రసాదం శేష వస్త్రం బహుకరించి ఘనంగా వేద ఆశీర్వచనం చేశారు.
