👉 మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిప్పరి తిరుపతి !
👉 ఇంజనీర్, కలను అడ్డుకున్నారు అజ్ఞాతంలోకి వెళ్ళాడు !
J.SURENDER KUMAR,
విప్లవ ఉద్యమంలో అణగారిన కులాల నాయకత్వమే సరైంది, అనే చర్చ నాలుగు దశాబ్దాల క్రితమే పీపుల్స్ వార్ గ్రూపులో కేజీ సత్యమూర్తి, ఆ పార్టీలో కొనసాగినంత కాలం ఆనాటి పార్టీ చీఫ్ కొండపల్లి సీతారామయ్య తో జరిగేది. అనగదొక్కబడుతున్న వారిలో హరిజనులే ఎక్కువ మంది ఉన్నారు. కమ్యూనిస్టు భావజాలం గల (పీపుల్స్ వార్ , మావోయిస్టు) పార్టీల నాయకత్వం అంతా మొదటి నుంచి అగ్రవర్ణాల చేతిలో కొనసాగింది అని చెప్పుకోవచ్చు. సుందరయ్య, రాజేశ్వర్ రావు, కొండపల్లి సీతారామయ్య, ముప్పాల లక్ష్మణరావు, నంబాల కేశవరావు, బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం దళిత సామాజిక వర్గానికి చెందిన తిప్పరి తిరుపతికి చేతికి సుప్రీం బాధ్యతలు వచ్చాయి.
👉 తిప్పరి తిరుపతి ఇంజనీర్ కావాలనుకున్నాడు..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన దళిత (మాల సామాజిక వర్గం) విద్యార్థి తిరుపతి, వెంకట్ నర్సయ్య గంగుబాయి మొదటి సంతానం ఆయనకు ఇద్దరు సోదరులు, ఓ సోదరి ఉన్నారు. తాను ఇంటర్ లో అత్యున్నత మార్కులు సాధించి ఇంజనీర్ అవుతానని స్నేహితులకు చెప్పుతూ తిరుపతి కలలు కన్నాడు.

1982-83 లో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విద్యార్థి, విద్యార్థి దశలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ తో సంబంధాలు ఉండేవి,
ఇంటర్ పరీక్షల సమయంలో ఆనాటి కొందరు పోలీస్ లు తిరుపతి, మరో ముగ్గురు అతని స్నేహితులు పరీక్షలు రాస్తున్న వారి గదిలోనే కూర్చుండి ఇప్పుడు పరీక్షలు రాయండి ఎలా పాస్ అవుతారో అంటూ ఇబ్బందులకు గురి చేయడంతో, ( మాల్ ప్రాక్టీస్, ఇన్విజిలేటర్లు, సహకరించకుండా మీరు తల తిప్పుకోకుండా) తిరుపతి ఇంటర్ ఫెయిల్ అయ్యాడు.
( ఇంటర్ పాసై డిగ్రీలో చేరితే వీరితో అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని అనే ఆలోచనతోనే నాడు కొందరు పోలీసులు ఇలా ప్రవర్తించారనే చర్చ కోరుట్ల పట్టణంలో ఉంది)
👉 సాయిని ప్రభాకర్ తో స్నేహం !
సప్లమెంటరీ పరీక్ష లో పాసైన తిరుపతి డిగ్రీ చదువుల కోసం కరీంనగర్ కు వెళ్లాడు. కళాశాలలో వల్లోజుల కోటేశ్వరరావు ( కిషన్ జి ) శిష్యుడు సాయిని ప్రభాకర్ తో తిరుపతి, మరో ఇద్దరి స్నేహం మొదలైంది.
వీరి భావజాలం పసిగట్టిన సాయిని ప్రభాకర్ వీరి కార్యకలాపాలు జిల్లాలో పోలీసులు పసిగట్టకుండా తిరుపతి మరో ఇద్దరిని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు రాడికల్ కార్యకలాపాల ప్రచారంకు పంపించాడు అనేది చర్చ.
ప్రభాకర్ తో వీరి స్నేహానికి కారణం, మేడిపల్లి మండలం కొండ్రికల్లా గ్రామం ప్రభాకర్ ది వీరి స్నేహానికి ఇది మరోకారణం కావచ్చు, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో ఆర్ ఎస్ యు ప్రచార కార్యకలాపాలలో పాల్గొంటూ నాలుగు దశాబ్దాల క్రితం తిరుపతి అజ్ఞాత బాట పట్టాడు.
👉 మావోయిస్టు దళాల సుప్రీం గా..

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో మే 21న జరిగిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవ్ రావు, అలియాస్ బసవరాజు సారయ్య, అలియాస్ గగన్న, తో సహా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్, అలియాస్ గగన్న వారసుడిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేబూజీ ఎన్నికయ్యారు.
👉 సమావేశం జరిగిందో ? సమాచార మార్పిడితో జరిగిందో ?

మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక ఆయా రాష్ట్రాల ఆ పార్టీ బాధ్యులు సమావేశమై తీసుకునే కీలక నిర్ణయం.
ప్రస్తుతం దండకారణ్యంలో మావోయిస్టు అగ్ర నాయకత్వం తమ రహస్యం స్థావరాల నుంచి బయట అడుగుపెట్టని పరిస్థితి నెలకొంది. రెడ్ కారిడార్ లో దాదాపు 60 శాతం భద్రత దళాల ఆధీనంలో ఉన్నాయి.
దండకారణ్యం లో చెట్లు, పుట్టలను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. భద్రతా దళాల పహారాలు, ఆధునిక పరికరాలు, నిఘా నేత్రాలు, అనుక్షణం అంతరిక్ష నుంచి గాలింపులు, కొనసాగుతున్న ఇలాంటి తరుణంలో మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం సమావేశమై చర్చించే అవకాశాలు సాధ్యం కాకపోవచ్చు,
అయితే ఐదు నెలల వ్యవధిలోనే మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక సమాచార వ్యవస్థతో జరిగి ఉండవచ్చు అనేది చర్చ. దీనికి తోడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లొంగిన మావోయిస్టు అగ్ర నాయకుల సమాచారం మేరకు తిరుపతి ఎంపిక వెలుగు చూసినట్టు చర్చ మొదలైంది.