ధర్మపురి ఆలయానికి చెందిన విలువైన కాపర్ వైర్ మాయం !

J SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన దాదాపు లక్ష రూపాయలకు పైగా విలువైన బోర్వెల్, కాపర్ వైర్ మాయమైంది. ఈ అంశంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారో ? అంతర్గతంగా విచారణ చేస్తున్నారో ? అనే విషయం స్పష్టత  లేదు.

👉 వివరాలు ఇలా ఉన్నాయి..

ధర్మపురి ఆలయ కు చెందిన జంబి గద్దే షెడ్, (అక్కపెళ్లి  శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉంది) గతంలో ఇక్కడ ఆలయ నిధులతో బోర్ బావిని, విద్యుత్తు మోటార్ తో సహా అమర్చారు. విజయదశమి పర్వదినం రోజున స్వామి వారు ఊరేగింపుగా ఇక్కడికి వస్తారు, స్వామివారాలకు ఇక్కడ, అర్చకులు, వేద పండితులు,  ఘనంగా ప్రత్యేక పూజలు చేస్తారు. విజయానికి సూచికంగా పోలీస్ శాఖ వారు ఇక్కడ ఆరోజు గాలిలో కాల్పులు జరుపుతారు.

ఇక్కడ చెడిపోయిన బోర్ బావి లో మోటర్ మరమ్మత్తుల కోసం గత కొన్ని రోజుల క్రితం ఆలయ అధికారులు, సిబ్బంది సమక్షంలో కాపర్ వైర్ తో సహా మోటర్ ను వెలికి తీశారు. మోటార్ మరమత్తు కాకపోవడంతో షెడ్డులోనే వైర్ తో సహా మోటర్ ను వదిలి గేటుకు తాళం వేశారు. గత మూడు రోజుల క్రితం ఆ షెడ్డులో ఉండాల్సిన దాదాపు లక్షకు పైగా విలువ గల కాపర్ వైర్ మాయం అయినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.