👉 సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ !
J SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ₹ 5 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి , ప్రత్యేక శ్రద్ధతో ధర్మపురి నియోజకవర్గానికి భారీ స్థాయిలో నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మక నిర్ణయం” అని మంత్రి అన్నారు.
ధర్మారం తెనుగువాడ నుండి ఎండపల్లి క్రాస్ రోడ్ (కొత్తపల్లి బీటీ రోడ్డు నుండి ఎండపల్లి బీటీ రోడ్డు) )
ధర్మారం మండలం పెద్దపల్లి జిల్లా కు ₹ 3 కోట్ల 20 లక్షలతో పాటు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి పంచాయతీరాజ్ బ్రిడ్జి రోడ్డు నుండి, పందుల గుట్ట, మద్దులపల్లి గ్రామం మండలం పెగడపల్లి కు ₹ 2 కోట్లు మంజూరు చేశారని మంత్రి అన్నారు .
అసెంబ్లీలో పరిధిలో ప్రతి గ్రామ అభివృద్ధి పథంలో సాగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. “ప్రజల ఆశలతో, కలలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటూ, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందన్నారు.. ఈ నిధుల మంజూరుతో ధర్మపురి అసెంబ్లీ అభివృద్ధి పథంలో ప్రయాణించనున్నదని, పేర్కొంటూ ప్రజల పక్షాన మరోసారి మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.