👉 నివాళులు అర్పించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణం లో శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక చింతామణి చెరువు కట్టపై ఉన్న ఐలమ్మ విగ్రహానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరలపై తిరగబడిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరనారి, తెలంగాణ రైతాంగ పోరాటంలో యుద్ధభేరి మోగించి చరిత్రలో నిలిచిందని మంత్రి అన్నారు.

చాకలి ఐలమ్మ సామాజిక సమానత్వానికి ప్రతీక, అణగారిన వర్గాల స్వాభిమానానికి చిహ్నం. ఆమె పోరాటమే నేటి తరాలకు ప్రేరణ. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ ఆశయాల సాధనలో కట్టుబడి సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందిఅని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ముందుగా మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.