👉 బ్రహ్మచారిణి పసుపు రంగు చీరలో మల్లె బిల్వపత్రి దండలు దరించి దర్శనం !
J.SURENDER KUMAR,
ధర్మపురి క్షేత్రంలో మంగళవారం శ్రీరామలింగేశ్వర స్వామి (శివాలయము) లో దేవి నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజు అమ్మ వారు “బ్రహ్మచారిణి” పసుపు రంగు చీరలో మల్లె బిల్వపత్రి దండలు దరించి భక్తులకు దర్శనం ఇచ్చినది.


రెండవ రోజు ఉదయము వేదపండితులు, ఋత్వికులచే మహ సంకల్పము, పృద్వీకలశ, గణపతి పూజ, స్వస్తిఃపుణ్యహ వచనము. అఖండ దీప స్థాపన, నవగ్రహ, వాస్తు, క్షేత్ర పాలక, యోగిని,

అంకురారోపణ, మాతృక, సర్వతి మండల పూజలతో ప్రధాన కలశ స్థాపనలు జరిగినవి. ఇందులో భాగంగా సప్తశతీ పారాయణము, అమ్మ చతుషష్టి పూజ, శ్రీచక్రమునకు కుంకుమార్చన, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణలు జరిగినవి. మ కన్యకా, సువాసిని పూజలు జరిగాయి. సాయంత్రం రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో దీపాలంకరణ నిర్వహించారు