ధర్మపురి లో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు !

  👉 అమ్మవారిని దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్  కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి క్షేత్రంలో సోమవారం నుండి   శ్రీరామలింగేశ్వర స్వామి (శివాలయము) దేవి  నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా సనాతన సంప్రదాయ పద్ధతిలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు ఘోషలతో ప్రారంభమయ్యాయి. సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పూజాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.


సోమవారం ఆలయంలో  ఉదయం   కలశస్థాపన, స్వస్తి: పుణ్యహవాచనము, కలశ గణపతి పూజ, ఋత్వికవర్ణణ, మహాసంకల్పము, ప్రధాన కలశ స్థాపన, చతుషష్ఠిపణ, చండీ పారాయణము, హారతి, మంత్రపుష్పం, అనంతరం భక్తులకుతీర్థప్రసాద వితరణ చేశారు..


చతుషష్టిపూజ, చండీ పారాయణము, ప్రత్యేక పూజలు, నిర్వహించారు. మూలమంత్రంతో ఐదు (5) గురు బ్రాహ్మణోత్తములతో “చండీపారాయణం” శ్రీరామలీగేశ్వరస్వామి కి “ఏకాదశ రుద్రాభిషేకం” “కుమారిపూజ, సుహాసినిపూజలు నిర్వహించారు.


ఋత్వికులు ఏకరూప దీక్షావస్త్రాలను ఆలయం పక్షాన అందించారు వేద పండితులు “దేవీభాగవత పారాయణం” చేశారు.

వేద పండితులు సిహెచ్. ముత్యాల శర్మ, జి.భరత్ శర్మ, అలువాల క్రిష్ణ శర్మ, తాడూరి బాలరాం శర్మ, గుడ్ల రమేష్ శర్మ చండి పారాయణం చేశారు.


చతుషష్టి పూజలు, స్థాపితాదేవతాపూజలు,
దేవిభాగవత పారాయణం, ఏకాదశ రుద్రాభిషేకం
పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ, బొజ్జ రాజగోపాల్ శర్మ, నంబి అరుణ్ కుమార్, బొజ్జ సంపత్ కుమార్ శర్మ,నారాయణ శర్మ, డి.సాయిక్రిష్ణ శర్మ పి.సందీప్ శర్మ, తదితర వేద పండితుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగాయి.