👉 23 మంది విండో చైర్మన్ల పదవి కాలం తిరిగి పొడగించకుండా….!
J.SURENDER KUMAR,
ధర్మపురి సింగిల్ విండో పర్సన్ ఇన్చార్జిగా సహకార శాఖకు చెందిన అధికారి సత్యనారాయణకు, బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా సహకార శాఖ అధికారి మనోజ్ కుమార్, శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. సింగిల్ విండో చైర్మన్ల పదవీకాలాన్ని తిరిగి పొడిగించకుండా. వారిస్థానంలో సహకారశాఖ తరపున పర్సన్ ఇన్ చార్జీలను నియమించారు. ధర్మపురి సింగిల్ విండో తో పాటు మరో 22 విండోలకు సైతం సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించింది.
👉 ధర్మపురి ,పెగడపల్లి, గొల్లపల్లి, పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు ఎం. సత్యనారాయణ నిర్వహిస్తారు.
👉 తిర్మలాపూర్, పోతా రం, కల్లెడ సొసైటీలకు పర్సన్ ఇన్చార్జిగా ఏ. మల్లేశం !
👉 జగిత్యాల, ఇటిక్యాల, పోరుమల్ల సొసైటీలకు ఏ. సాయి కుమార్ గౌడ్ !
👉 నూకపల్లి, మేడిపల్లి సొసైటీలకు బి.సుజాత !
👉 సిర్పూర్, చిట్టాపూర్, యామాపూర్ ఎం.శ్రీనివాస్ !
👉 మల్లాపూర్, మెట్ల చిట్టాపూర్, భూపతిపూర్ కు ఎండీ. అసద్,!
👉 గంభీర్పూర్, వల్లంపల్లి, అయిలాపూర్ సొసైటీలకు సీహెచ్.మల్లేశం !
👉 తిమ్మాపూ ర్, మాదాపూర్, భూషణావుపేట సొసైటీలకు కె.నాగసంకీర్తన,లను నియమించారు.
👉 ఫిబ్రవరి మాసంలో విండోపాలకవర్గలు ఏర్పడ్డాయి !
2020 ఫిబ్రవరిలో పదవి బాధ్యతలు చేపట్టిన విండోల పాలకవర్గం కాలపరిమితి, ఈ సంవత్సరం ఫిబ్రవరి 14తో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వీరి పదవి కాలాన్ని మరో 6 నెలలు ఆగస్టు నాటికి పొడగించింది. తిరిగి ఆగస్టు మాసం నుంచి మరో ఆరు నెలల కాలం పాటు పొడగించింది. ఈసారి ప్రభుత్వం సహకార శాఖ నిబంధనల మేరకు కొనసాగుతున్న వాటికి మాత్రమే కొనసాగింపు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది.
👉 అవినీతి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో..
విండోలలో అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం, సహకార చట్ట నిబంధనలు పట్టించుకోకపోవడం, పంట రుణాల జారీలో అక్రమాలు, సొసైటీ స్థలాల ఆక్రమణ, ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చే కమీషన్ డబ్బులను ఇతర వాటికి వినియోగించడం తదితర ఆరోపణల నేపథ్యంలో 23 సొసైటీల పాలకమండళ్ల గడువు పొడిగింపును ప్రభుత్వం నియంత్రించి, సింగిల్ విండో చైర్మన్లను తప్పించి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు.
👉 నోటీసులు జారీ..?
పలు సొసైటీ చైర్మన్లకు, సీఈవోలకు సహకార శాఖనోటీసులు జారీ జారీ చేసి సమగ్ర విచారణ కు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం విండోల వారిగా వారీగా పలు అంశాలతో సమాచారం సేకరిస్తున్నది. విండోలో నిధుల దుర్వినియోగం జరిగిందా..? జరిగితే వాటిపై ఎలాంటి విచారణ చేపట్టారు..? దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా…? సొసైటీ కార్యకలాపాలపై ఆడిట్ చేశారా..? చట్టపరమైన చర్యలకు సంబంధించిన పిటిషన్ ఏదైనా పెండింగ్ లో ఉందా..? విండో పరిధిలో పాత బకాయిల పరిస్థితి…?. రుణాల తిరిగి చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా..? అనే తదితర అనే తదితర అంశాల సమాచారం పంపించాలని సహకార శాఖ కమిషనర్ ఆదేశాలలో స్పష్టం చేసినట్టు సమాచారం. అధికారులు విండోల వారీగా సమాచారం, పనితీరును వివరాల సేకరణలో అధికారులు ఉన్నట్టు తెలిసింది.