👉 భూమిని అమ్ముకున్నారో ? వేలాది రూపాయలు పంచుకున్నారో ?
👉 13 గుంటల భూమి పట్టా కావడం లేదు !
👉 పట్టేదారు వద్ద ఉన్న వేలాది రూపాయలు ఎవరి పరం ?
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి సింగిల్ విండో కు చెందాల్సిన
13 గుంటల భూమిని పాలకవర్గం అమ్ముకున్నదో ?
భూ పట్టేదారు వద్ద ఉన్న వేలాది రూపాయలు
పంచుకున్నారో ?
అనే మిస్టరీ గత ఐదు సంవత్సరాలుగా వీడడం లేదు.
సంబంధిత అధికార యంత్రాంగం
ఈ భూ భాగోతం మిస్టరీ ఛేదించడం లేదు.
👉 వివరాలు ఇలా ఉన్నాయి..
ధర్మపురి సింగిల్ విండో పరిధిలో నాగారం, కమలాపూర్, మద్దునూర్, బీర్సాని, సిరికొండ, గోపులాపూర్, బుగ్గారం, వెలుగొండ, చిన్నాపూర్, నేరెళ్ల, తుమ్మేనాల, దోనూర్, సందయపల్లె, గాదేపల్లి, తీగల ధర్మారం గ్రామాలకు చెందిన 4325 మంది రైతులు మార్చి 23 నాటికి సభ్యత్వం కలిగి ఉన్నారు.
వీరి సభ్యత్వ వాటా ధనం ( షేర్ క్యాపిటల్ ) ₹1,48,66,743 ( కోటి, 48 లక్షలు, 66 వేల, 743 రూపాయలు)
👉 పాలకవర్గ ఏర్పాటు !
2020 ఫిబ్రవరి 15 న శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షుడిగా, మరో 12 మంది, సీఈవో తో కలసి 14 మంది కార్యవర్గం ఏర్పడింది.
👉 విండో అభివృద్ధి కోసం భూమి కొనుగోలు !
పాలకవర్గం ఏర్పడిన కేవలం ఐదు నెలలో లక్షలాది రూపాయల రైతుల సొమ్ముతో ఒకఎకరం భూమి కొనుగోలుకు పట్టేదారుకు డబ్బులు చెల్లించారు. ధర్మపురి మండలం నాగారం గ్రామ శివారులో సర్వేనెంబర్ 84 ఈ, లో కేవలం 0-27 గుంటల భూమి పట్టేదారు ఎడమల రాజేశ్వర్ రెడ్డి నుంచి విండో పేరిట జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2020, జూలై 6న డాక్యుమెంట్ నెంబర్ 4052/20, ద్వారా రిజిస్టర్ చేయించుకున్నారు.
విండో పేరిట రిజిస్ట్రేషన్ కావలసిన మరో 0-13 గుంటల భూమి రిజిస్టర్ చేయించుకోలేదు.
👉 13 గుంటల భూమికి పత్రం వ్రాయించుకున్నారు !
సింగిల్ విండోకు భూమిని విక్రయించిన పట్టేదారుడు ఏ రాజేశ్వర్ రెడ్డి నుంచి విండో అధ్యక్షుడు పత్రం వ్రాయించుకున్నా డు అందులో సారాంశం…

” ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ( ధర్మపురి సింగిల్ విండో ) అధ్యక్షుడికి వ్రాసి ఇచ్చిన ఒప్పంద నామ పత్రం లో నాగారం శివారు లో సర్వే నెంబర్ 84 ఈ లోని 1- 00 ( అక్షరాలు ఒక ఎకరం భూమిలో పట్టా ఉండి 0- 27 గుంటల భూమికి ధర చేసుకుని,₹ 3,95,500/- ( అక్షరాల మూడు లక్షల తొంబై ఒక్క వేయి ఐదు వందలు ,) పట్టాలేని 0-13 ( పదమూడు గుంటల భూమికి సగం ధర చొప్పున, మొత్తం 0-13 గుంటల కు ₹ 93,600/- ( తొంబై మూడు వేల ఆరు వందలు ) తీసుకుని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కు అమ్మితిని.
ఇట్టి భూమికి నాలుగు దిశలు గల రైతులు ఎవరు ఎటువంటి కాగితాలు తీసుకుని వచ్చిన పూర్తి బాధ్యత మాదే, మీరు ఇచ్చినటువంటి డబ్బులకు రెట్టింపు డబ్బులు చెల్లించడం ఖరారు ఇది మా ఇష్టపూర్వకంగా వ్రాసి ఇస్తున్న ఒప్పంద పత్రం సహీ అని
నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ పై ఒప్పంద పత్రం వ్రాయించుకున్నారు”
👉 భూమంతర్ ఇక్కడే …
పట్టేదారు ఎడమల రాజేశ్వర్ రెడ్డి నుంచి 0-27 గుంట ల భూమి ధర్మపురి సింగిల్ విండో పేరిట జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2020, జూలై 6న రిజిస్టర్ అయ్యింది. అయితే 10 రోజుల తర్వాత పట్టేదారతో విండోకు 2020 జూలై 16న నాన్ జుడీషియల్ స్టాంపు పేపర్ పై వ్రాయించుకోవడం తోనే పాలకవర్గం భూ మంతర్ కు శ్రీకారం చుట్టింది.
👉 0-13 గుంటల భూమి పట్టేదారు పేరున ఉంది !

పట్టేదారు రాజేశ్వర్ రెడ్డి, పాస్ పుస్తకం నెంబర్ T 18030120113, డాక్యుమెంట్, 4052/2020. ఖాతా నెంబర్ 283, లో లావాదేవీల తరువాత విక్రేత కు, సర్వే నెంబర్లు, 174ఆ/2 లో, 81 ఇ, 83 ఈ, లో భూమి ఉన్నట్టు నమోదు అయి ఉంది. ధర్మపురి సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ అయిన 0-27 గుంటల భూమికి(ధర్మపురి సింగిల్ విండో పేరిట) పట్టేదారు పాస్ పుస్తకం నంబర్ T18030120460, ఉన్నట్టు రెవెన్యూ రికార్డులలో నమోదు అయ్యింది.
👉 ధర్మపురి విండో ఐదు సంవత్సరాల పాలకవర్గ పదవీకాలం ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 కు ముగిసే నేపథ్యంలో ప్రభుత్వం వీరి పదవి కాలం ఆగస్టు 15 వరకు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా పొడిగించింది. తిరిగి ఆగస్టు నెల14న ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య, 386 ద్వారా మరో ఆరు నెలల పాటు పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పాలకవర్గం పదవీకాలం పొడిగిస్తున్న ప్రభుత్వం, ధర్మపురి విండో కు చెందాల్సిన 0 -13 గుంటల భూమిని ఎందుకు పట్టా చేయించడం లేదో ఐదు సంవత్సరాలుగా అంతు పట్టని మిస్టరీగానే మిగిలిపోయింది.