👉 చాకచక్యంగా దొంగతనం ఛేదించిన ధర్మపురి పోలీసులు !
👉 నిందితులు ఇద్దరు మైనర్లు !
J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో శనివారం సాయంత్రం జరిగిన దొంగతనం సంఘటనను స్థానిక పోలీసులు 24 గంటలలో చేదించి దాదాపు ₹ 22 లక్షల విలువగల బంగారు ఆభరణాలు స్వాధీనపరచుకొని నిందితులైన ఇద్దరు మైనర్లను జువెనైల్ న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.
జగిత్యాల డిఎస్పి రఘు చందర్ కథనం మేరకు..
ధర్మపురి పోలీస్ స్టేషన్ లో సోమవారం డి.ఎస్.పి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
స్థానిక వస్త్ర వ్యాపారి కోలేటి మల్లికార్జున్, ఇంటిలో శనివారం సాయంత్రం ఎవరు లేని సమయంలో తాళం పగల కొట్టి
బీరువాలో వున్నా దాదాపు 22.71 తులాలు బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని వ్యాపారి ఫిర్యాదు చేసినట్లు డి.ఎస్.పితెలిపారు.

ధర్మపురి సి.ఐ ఎ. రాంనర్సింహ రెడ్డి, ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐలు ఉదయ్ కుమార్ , రవీందర్ ల తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్ లు, అనుమానితుల సంచారం, సాంకేతిక ఆధారాలతో 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మైనర్ నిందితులను అదుపులోకి తీసుకొని బంగారు ఆభరణాలు స్వాధీన పరుచుకున్నట్టు డి.ఎస్.పి తెలిపారు.
చాకచక్యంగా దొంగతనం కేసు చేదించిన సి.ఐ.,ఎ. రాంనర్సింహ రెడ్డి, ఎస్.ఐ,లు., పి. ఉదయ్ కుమార్, M రవీందర్ కుమార్, మరియు కానిస్టేబుల్స్ అయిన B.రమేష్ నాయక్, రణధీర్, M.రమేష్, రామస్వామి, అరీఫ్, మహేందర్ లను మరియు ఇతర సిబ్బందిని జిల్లా అశోక్ కుమార్ అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు.