J.SURENDER KUMAR,
మంగళవారం బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీతో సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
జాగృతి భవన్ లో బుధవారం ఆమె మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా లేఖను ప్రదర్శించారు.
👉కవిత మీడియా సమావేశంలో బుల్లెట్ పాయింట్స్..
👉 బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా.. స్పీకర్ ఫార్మాట్‌లో ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన కవిత
👉 నన్ను సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న బీఆర్ఎస్ నుంచి ఓ ప్రకటన వచ్చింది.. తీహార్ జైలు నుంచి వచ్చిన తరువాత ఎన్నో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను.. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడడం పార్టీ వ్యతిరేకమా?
👉 నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నా.. కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నా.. నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు.
👉 నాపై కుట్రలు జరుగుతుంటే.. చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలోలని వేడుకున్నా.. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా? 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడగరా?
👉 నన్ను సస్పెండ్ చేసినా.. పార్టీలో నేను కోరుకున్న ప్రజాస్వామ్యం వచ్చింది.. ఆ ఇద్దరు నన్ను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర చేశారు.. రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది.
👉 హరీష్‌రావు, రేవంత్‌రెడ్డి ఒకే ఫ్లైట్‌లో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు మొదలయ్యాయి.. రేవంత్, హరీష్‌రావు కుమ్మక్కై నాపై కుట్రలు చేశారు.. రేవంత్‌తో హరీష్‌రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారా లేదా చెప్పండి?.
👉 హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్.. ఆయనే సమస్య పరిష్కరించినట్టు, పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారు
👉 కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న రేవంత్.. హరీష్‌పై ఎందుకు చేయడం లేదు.. నాన్నపై సీబీఐ కేసు వచ్చిందంటే దానికి కేవలం హరీష్‌రావే కారణం.. తెలంగాణ ఉద్యమం డే-1 నుంచి హరీష్‌రావు లేరు.. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీష్‌రావు వద్దన్నారు.. పార్టీకి చెడ్డపేరు వస్తుంటే నేరుగా వెళ్లి నేరుగా వైఎస్ఆర్‌ను హరీష్ కలవలేదా?-