ఫ్లాష్.. ధర్మపురి వాసులకు సైబర్ ఫోన్ కాల్స్ !

👉 అప్రమత్తమైన వ్యాపారి !


J.SURENDER KUMAR,

నేను బ్యాంకు మేనేజర్ ను మాట్లాడుతున్న మీరు బ్యాంక్ కు వేల రూపాయలు లోన్ డబ్బులు చెల్లించాలి వెంటనే పేమెంట్ చెయ్యండి అంటూ సైబర్ నేరగాళ్లు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. శుక్రవారం ధర్మపురి పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారికి ఫోన్ వచ్చింది.  బ్యాంక్ లో ఆడిట్ జరుగుతున్నది, మీరు బ్యాంకులో లోన్ అమౌంట్ డిపాజిట్ చేయాలి అనే ఫోన్ లో హెచ్చరించాడు.


ఫోన్ పే ద్వారా వెంటనే చేయండి, లేకుంటే మీపై పోలీస్ కేసులు నమోదు చేస్తామంటూ  హెచ్చరించాడు. వ్యాపారి అప్రమత్తమై బ్యాంకుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకున్నాడు. విషయం మేనేజర్ కు వివరించాడు. మా బ్యాంక్ సంస్థలు ఎలాంటి ఫోన్ కాల్స్ ఎవరు చేయరు,  సైబర్   నేరగాళ్లు ఫోన్ చేసి ఉంటారు అప్రమత్తంగా ఉండండి నూతన ఖాతాదారుడికి మేనేజర్ వివరించారు.


ఫోన్ నెంబర్ 9703273223 తో పట్టణంలో పలువురికి ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ వచ్చాయి. తన పేరు శ్రీనివాస్ రెడ్డి బ్యాంక్ ఆడిట్ ఆఫీసర్ అంటూ పరిచయం చేసుకుంటున్నాడు. స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్నాడు. ఈ నెంబర్ ట్రూ కాలర్ లో శ్రీశైలం అగుపిస్తున్నది. పట్టణంలో పలువురికి ఫోన్ కాల్స్ వెళ్ళినట్టు సమాచారం. ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణకు స్థానిక పోలీస్ యంత్రాంగం శ్రీకారం చుట్టినట్టు తెలిసింది.