ఫ్లాష్..ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా కలెక్టర్ కె ఎస్ శర్మ ఇక లేరు!

J.SURENDER KUMAR ,

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా సుదీర్ఘకాలం  పనిచేసిన కేఎస్ శర్మ,( కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మ)  శనివారం హైదరాబాదులో ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. ప్రస్తుతం కరీంనగర్ లోని కలెక్టరేట్ భవన సముదాయం ఆయన హాయంలో నిర్మితమైంది. కరీంనగర్ జిల్లాలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న కలెక్టర్ కె ఎస్ శర్మ, కాలేశ్వరం క్షేత్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు.

శ్రీ రామాలయ నిర్మాణం, రాజగోపుర నిర్మాణం మొదలైన జిల్లాలో ఎన్నో దేవాలయ అభివృద్ధి పనులు ప్రత్యేక శ్రద్ధ తో జరిపించారు.
వారంలో నాలుగు రోజుల పాటు కాళేశ్వర క్షేత్రంలో అభివృద్ధి పనులతో పాటు కాలేశ్వర క్షేత్రానికి విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించిన ఘనత కె ఎస్ శర్మ దే.  ధర్మపురి లోని అతి పురాతన శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల ( నైట్ కాలేజ్ ) భవన నిర్మాణం కలెక్టర్ కె ఎస్ శర్మ , ప్రత్యేక శ్రద్ధతో చేయించారు.

దేశంలో మొట్టమొదటి ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా కొనసాగారు. కే శర్మ మృతి పట్ల విద్యావేత్తలు, కళాకారులు, సంగీత సాహిత్య వేత్తలు కె ఎస్ శర్మ ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.