గణనాథులను దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ధర్మారం గొల్లపల్లి మండల కేంద్రాల్లోని వినాయక మండపాలను సందర్శించి కొలువుదీరిన గణనాథులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రికి స్వామి వాళ్ళ శేష వస్త్రం బహుకరించారు.


👉 ధర్మారం మండలంలో…

ధర్మారం మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలలో గణనాథులను మంత్రి దర్శించుకున్నారు.


👉 గొల్లపల్లి మండలంలో…


గొల్లపల్లి మండల కేంద్రంలోని పలు వినాయక  మండపాలలో గణనాథులను మంత్రి దర్శించుకున్నారు.


👉 ధర్మపురి మండలంలో..


రాయపట్నం గ్రామంలో పలు  వినాయక మండపాలలో గణనాథులను దర్శించుకున్నారు.

👉 అంబేద్కర్ సంఘ భవనం కు ₹ 5 లక్షల ప్రొసీడింగ్స్ !

ప్రత్యేక పూజలు అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్, అంబేద్కర్
సంఘ భవనం అసంపూర్తి పనులు పూర్తి చేయుటకొరకు ₹5 లక్షల (ప్రొసీడింగ్) మంజూరు పత్రాన్ని సంఘ సభ్యులకు మంత్రి అందించారు.

👉 గణపతి లడ్డు వేలంలో ₹ 1లక్ష 6 వేలకు..

రాయపట్నం అంబేద్కర్ యువసేన స్టార్ యూత్ మరియు కుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ వినాయక కృపాకటాక్షాలతో నవరాత్రి మహోత్సవ పూజలు ఘనంగా  నిర్వహించుకున్న గణేశుడి లడ్డు ప్రసాదం వేలం వేశారు.


రాయపట్నం గ్రామానికి చెందిన అంతర్పుల రమేష్ – మమత రాణీ  లడ్డును, ₹1,06,116/- (అక్షరాల  ఒక్క లక్ష ఆరు వేల ఒక వందపదహారు ) దక్కించుకున్నారు.


వారికి వారి కుటుంబ సభ్యులకు వినాయకుని ఆశీస్సులు ఉండాలని రాయపట్నం కు చెందిన అంబేద్కర్ యువసేన స్టార్ యూత్ సభ్యులు కోరుకున్నారు.