గిరిజన  సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ  అభివృద్ధి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ సమగ్ర అభివృద్ధి చేపట్టాలని భావించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  మేడారంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  మేడారంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

మేడారం ఆలయ సమీపంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణలోని గిరిజన ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.