గిరిజన తండాల అభివృద్ధి కోసం ₹ 740 కోట్ల నిధులు!

👉 మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు గిరిజన తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం రోడ్లు తదితర నిర్మాణా పనులకు ఇటీవలే  దాదాపు ₹ 740 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి నియోజకవర్గం  ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం నుండి పెగడపెల్లి మైక్య వెంకయ్యపల్లె వరకు ₹ 11.2  కోట్ల వ్యయంతో చేపట్టనున్న బైపాస్ రోడ్డును  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ…

మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి  ఆలోచన మేరకు గిరిజన తండాల్లో రోడ్ల నిర్మాణానికి తదితర అభివృద్ధి పనుల కోసం వందలాది కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.


గిరిజన, లంబాడీ తండాల్లో గిరిజన భవన్ నిర్మాణాలకు, మరియు కల్వర్టులు, మధ్యతర సాగునీటి దాదాపు  ₹ 35  కోట్ల రూపాయలు అంచనాల నివేదికలు సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకు వెళ్ళగా సీఎం సానుకూలంగా స్పందించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.


గతంలో ట్రైబల్ వెల్ఫేర్ నుండి మంజూరు అయిన ₹12 కోట్ల రూపాయల కీచులాటపల్లె, బుద్దేశ్ పల్లె, దుబ్బాల గూడెం రోడ్లు పనులు చేపడుతున్నామని, పనులు పురోగతిలో ఉన్నాయని,ఈ రహదారుల కనెక్టివీటి స్థానికంగా ఉన్న ప్రజలకు రైతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని
, గిరిజన లంబాడీ తండాల అభివృద్ధే ద్యేయంగా  ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి అన్నారు.

👉 సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు ₹16 లక్షల రూపాయలు పంపిణీ !


వివిధ కారణాలతో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకున్న 78 మంది లబ్ధిదారులకు  ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ₹16,87,500 విలువగల చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్ పెగడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేశారు.


4 నెలల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందిన నంచర్ల గ్రామవాసి  ఎడ్ల రాజేందర్ రెడ్డి కుటుంబానికి, విద్యుత్ శాఖ నుంచి ₹ 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మంత్రి అందించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …

“రాష్ట్రంలోని ప్రతి గిరిజన తండాకు రహదారులు కల్పించడం మా ప్రభుత్వం లక్ష్యం. గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి కృషి చేస్తాం. నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరంగా నిలుస్తుంది” అని అన్నారు. కీచులాటపల్లి గ్రామం నుండి ధర్మారం మండలం మల్లాపూర్ వరకు ₹ 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులను మంత్రి పరిశీలించారు.

అక్కడి రైతులు సూచించిన సమస్యలపై స్పందిస్తూ రైతుల అభిప్రాయం మేరకే రహదారి నిర్మాణం చేపడతామని, ఎవరికి ఇబ్బంది కలగకుండా పనులు జరిగేలా బాధ్యత వహిస్తానని, తండాలకు రహదారులతో పాటు సంక్షేమ భవనాల నిర్మాణానికి కూడా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.