👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
తాను రాష్ట్ర మంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో గిరిజన తండాలు, ఆదివాసి వాడల అభివృద్ధికి ₹740 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టి మహిళలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్రాజెక్టులు చేపట్టినట్లు
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మంగళవారం భూపాలపల్లి మండలంలో గొల్ల బుద్ధారం నుండి రాజునాయక్ కుంట, దూదేకులపల్లి నుండి రేగడిగుట్ట వరకు, ₹ 4 కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణ పనులకు భూపాలపల్లి శాసనసభ్యుల గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి శంఖుస్థాపన చేశారు.
👉 అనంతరం గొల్ల బుద్ధారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ...

👉 రాష్ట్ర ముఖ్యమంత్రి సంపన్నులు తినే సన్న బియ్యం, నిరుపేదలు తినాలనే సంకల్పంతో చౌక ధరల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఎంతోకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులతో పాటు నూతన రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు.
👉 గత ప్రభుత్వ హయాంలో ధరణితో భూములకు హక్కులు లేక పట్టాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, ధరణితో ప్రజలు జీవనపాదులు సైతం కోల్పోయారని, గత ప్రభుత్వం పేదల పొట్ట కొట్టిందని పేర్కొన్నారు.

👉 ముఖ్యమంత్రి ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ధరణిని రద్దుచేసి భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిరుపేద గౌరవప్రదంగా జీవించాలని రెండు పడక గదుల ఇండ్లు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
👉 ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇండ్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రతి సోమవారం నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గిరిజన, ఎస్సి, మైనారిటీ సంక్షేమ శాఖలలో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ ఉన్న వేతనాలు రెండు
రోజుల్లో జమ చేస్తామని, ఎవరు ఆందోళన చెందొద్దని మంత్రి సూచించారు.
👉 నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ్యులు కోరిన విధంగా నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. సమ్మక్క సారాలమ్మ జాతరను అంగరంగ వైభవంగా జరిపేందుకు 6 నెలల ముందు నుండి సమగ్ర కార్యచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
👉 యూరియా కొరత గురించి మంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ వల్ల ఇతర దేశాల నుండి రావాల్సిన ముడి సరకు రాక కొరత ఏర్పడిందని సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి యూరియా కొరత లేకుండా చేస్తామని మంత్రి వివరించారు.
👉 ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…

అధికారం చేపట్టి 21 నెలల కాలంలో పేదల కష్టంలో భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నీతి నిజాయితీగా రోజుకు 18 గంటలు పని చేస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన ₹ 8 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతూనే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేస్తున్నామని తెలిపారు.
👉 ప్రతినెల ఆర్టీసీకి ₹400 కోట్ల రూపాయలు చెల్లిస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీని ₹5 లక్షల నుంచి ₹10 లక్షల పెంచి నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ కార్డు లేని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డులు పంపిణీ అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
👉 రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 58 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 20 వేల ఇండ్లు కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
👉 రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 26 లక్షల 70వేల మందికి రుణమాఫీ చేశామని తెలిపారు. ఎన్నికలు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ధరణి రద్దుచేసి 12 సంవత్సరాలు సేద్యంలో ఉన్న రైతులకు భూభారతి చట్టం ద్వారా అన్ని హక్కులు కల్పిస్తామని తెలిపారు. 9 రోజుల్లో ₹9 వేల కోట్ల రూపాయలు రైతుబరోసా నిధులు మంజూరు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు.
👉 గత ప్రభుత్వ హయాంలో రాళ్లు, రబ్బులు, కొండలకు సైతం రైతుబంధు నిధులు చెల్లించి ₹21 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని తెలిపారు. మేడారం వెళ్లేందుకు కమలాపూర్ క్రాస్ నుండి రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ₹ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్య సేవలు.మెరుగు పరిచేందుకు సిటీ స్కానింగ్, వైద్య, సిబ్బంది పోస్టులు భర్తీ వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పాఠశాలలకు అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
👉 కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ …

పాఠశాలలల్లో మౌలిక సౌకర్యాలు కల్పనకు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. మహిళ ఆర్థికాభివృద్ధి కి కలెక్టరేట్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
👉 మహిళా స్వయం సహాయ సంఘాలకు ఆదాయం కల్పించేందుకు వ్యాపారాభివృద్ధికి ఇన్నోవేటివ్ ఐడియాలపై అవగాహన కల్పిస్తున్నామని, కొన్ని రోజుల క్రితం ఐడిఓసి కార్యాలయంలో వి హబ్ ద్వారా వ్యాపార అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
👉 మహిళా ఉత్పత్తులను బ్రాండింగ్ చేసేందుకు అవకాశాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో విద్యా, వైద్య రంగాలపై అత్యంత ఫోకస్ చేస్తున్నామని తెలిపారు.
👉 ఎస్డీఎఫ్ నిధుల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బడికిరాని పిల్లలు ఉండొద్దని ప్రతి ఒక్కరికి విద్యను అందించేందుకు ఒక బాధ్యతగా, సవాలుగా తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

👉 అనంతరం మంత్రిగా భాద్యత లు చేపట్టి మొదటిసారి జిల్లాకు విచ్చేసిన మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ అధికారిని మల్లీశ్వరి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.