హైకోర్టు చీఫ్ జస్టిస్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకం వంటి అంశాలపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తో, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి శనివారం సమావేశమయ్యారు.

👉 రాష్ట్రంలో ముఖ్యంగా కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు అవసరమైన మేరకు సిబ్బంది నియామకాలను చేపట్టాలని జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సీఎంకు సూచించారు. ఈ అంశాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి  దృష్టికి తెచ్చారు.

👉 ప్రాధాన్యత క్రమంలో వివిధ జిల్లాల్లో కోర్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా సిబ్బందిని నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.

👉 ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన ఈ సమావేశంలో జస్టిస్ సామ్ కోశి , జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి  పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.