👉 తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి ప్రకటన లో….
J.SURENDER KUMAR,
తెలంగాణ మీడియా అకాడమీ మరియు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (IJM) సంయుక్తంగా సెప్టెంబర్ 16 న మంగళవారం ఉదయం 10:00 గంటలకు “హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు బాండెడ్ లేబర్” అంశాలపై ప్రత్యేక మీడియా వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాయి అని తెలంగాణ మీడియా అకాడమి, కార్యదర్శి ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం మీడియా ప్రతినిధులకు అవగాహన పెంపొందించేలా, ఈ నేరాల తీవ్రతను అర్థం చేసుకోవడం, బాధితుల పట్ల ప్రదర్శించే వైఖరి లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది.
ఈ వర్క్‌షాప్‌లో “హ్యూమన్ ట్రాఫికింగ్ & బాండెడ్ లేబర్” బాధితుల పునరావాసం, న్యాయపరమైన, సమాజపరమైన మద్దతు అంశాలపై నిపుణులు ప్రసంగించనున్నారు.
మీడియా పాత్ర, బాధితుల గౌరవాన్ని కాపాడుతూ సమగ్ర కథనాలను తయారు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. సివిల్ సొసైటీ ప్రతినిధులు, న్యాయ నిపుణులు, అనుభవజ్ఞులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ వేదిక జర్నలిస్టులు, ఎడిటోరియల్ టీంలకు అత్యంత ఉపయోగకరంగా ఉండనుంది అని ప్రకటనలో వివరించారు.
తెలంగాణ మీడియా అకాడమీ ఈ సమస్యపై జర్నలిజానికి అవసరమైన అవగాహనను పెంచే లక్ష్యంతో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూ వస్తోంది. IJM సంస్థ ఈ రంగంలో దేశవ్యాప్తంగా చేసిన అవిశ్రాంత సేవను మనందరికీ పరిచయం చేస్తూ, న్యాయ వ్యవస్థతో కలిసి పని చేస్తోంది.
👉 ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనదలచిన మీడియా ప్రతినిధులు తేది:15.09.2025 మధ్యాహ్నం 1-00 గంట వరకు తమ పేరు, సంస్థ పేరు, హోదా మరియు పని చేస్తున్న ప్రదేశంతోపాటు తమ మొబైల్ నెంబర్ ను ఈ కార్యాలయ మేనేజర్ సెల్ నెంబర్ 7093600977 కు వాట్సాప్ ద్వారా రిజిష్టర్ చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.
మొదట నమోదు చేసుకున్న మొదటి 70 మంది జర్నలిస్టులకు మాత్రమే ఈ వర్క్ షాప్ లో పాల్గొనుటకు అనుమతించబడును అని ప్రకటనలో స్పష్టం చేశారు.