👉 జగిత్యాలలో ఇసుక బజార్ ప్రారంభోత్సవంలో.. మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా ఇసుక అక్రమ రవాణా కట్టడికే ప్రభుత్వం పటిష్టమైన చర్యలలో భాగంగా సాండ్ బజార్ లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణినగర్ లో ప్రభుత్వ ఖానిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇసుక బజార్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
👉 ఈ సందర్బంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ఇసుక బజార్ (సాండ్ బజార్) ల ద్వారా ప్రజలకు సులభంగా సరసమైన ధరకు ఇసుక లభిస్తుందని, మంత్రి అన్నారు.
స్టాక్ పాయింట్ల వద్ద ₹ 800 చెల్లిస్తే ఇసుక ఇంటికే వస్తుందని తెలిపారు. అదేవిధంగా ఇసుక దోపిడీని, దళారీ వ్యవస్థను అరికట్టేందుకు సాండ్ బజార్ లు దోహద పడుతాయని మంత్రి అన్నారు.
ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక తరలించడానికి లారీలు అందుబాటులో ఉంటాయని, ఇవి 24 గంటలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ప్రజపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు ఇసుక ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు.

ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాండ్ బజార్ లు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు జరిగిందని అవి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ…..
జగిత్యాల ప్రాంతం వారు సాండ్ బజార్ లను సద్వినియోగం కలెక్టర్ బి. సత్యప్రసాద్ చేసుకోవాలని కోరారు. జిల్లాలో కోరుట్ల, కథలాపూర్, ఇబ్రహీంపట్నం ఏరియాలో మాత్రమే ఇసుక రీచ్ లు ఉన్నందున జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఇసుక కొనుగోలు చేయడం భారంగా మారిందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం తెలంగాణ ఖనిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో ముడున్నర ఎకరాల్లో ఇసుక బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
స్వంత అవసరలకు ఇసుక ఉపయోగించుకునే వినియోగదారులు స్థానిక ఎమ్మార్వో వద్ద ₹ 800 చాలాన రూపంలో చెల్లించి ఇసుక పొందాలని తెలిపారు. రవాణా వాహనాలకు, కూలీలకు అదనపు రూపాయలు వినియోగదారులే చెల్లించాలని తెలిపారు.

త్వరలో వెల్గటూర్ మండలంలో ఇసుక బజార్ ఏర్పాటుకు పరిశీలన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఉచితంగా ఇసుక లభిస్తుందని తెలిపారు. అనుమతులు లేని ఇసుక అక్రమ రవాణపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టిజిఎండిసి జనరల్ మేనేజర్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ బిఎస్. లత, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, ప్రాజెక్ట్ అధికారి వినయ్, మరియు సంబందిత అధికారులు
పాల్గొన్నారు.