J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐటీఐని ఆధునిక సాంకేతిక పరికరాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) గా మార్చి ఏర్పాటు చేసిన కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తో కలిసి శనివారం ప్రారంభించారు.
టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ₹ 6 కోట్లు 70 లక్షల రూపాయల వ్యయంతో ఈ కేంద్రం ఏర్పాటుచేయగా, సుమారు ₹ 45 కోట్ల విలువైన ఆధునిక యంత్ర పరికరాలు విద్యార్థుల శిక్షణ కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు చేరువ కావడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ఆధునిక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశ్యం యువతకు గ్లోబల్ స్థాయి నైపుణ్యాలు అందించడం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఐటీఐ ప్రిన్సిపాల్ రవీందర్, ఎమ్మార్వో వరంధన్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.